హైదరాబాద్ పబ్‌లో ర‌చ్చ ర‌చ్చ‌.. టాలీవుడ్‌ న‌టికి, నిర్వ‌హ‌కుల‌కు మ‌ధ్య వార్..!

నటి కల్పిక గణేశ్ తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్‌కి వెళ్లింది.

By Medi Samrat
Published on : 31 May 2025 12:47 PM

హైదరాబాద్ పబ్‌లో ర‌చ్చ ర‌చ్చ‌.. టాలీవుడ్‌ న‌టికి, నిర్వ‌హ‌కుల‌కు మ‌ధ్య వార్..!

నటి కల్పిక గణేశ్ తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్‌కి వెళ్లింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వహకులు, ఆమెకు మధ్య వాగ్వాదం జరిగింది. తనపై పబ్ నిర్వహకులు దురుసుగా ప్రవర్తించారని కల్పిక ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని నటి కల్పిక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

నటిపై పబ్ సిబ్బంది పచ్చి బూతులతో రెచ్చిపోయినట్లు వీడియోలో స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఆమె ఒక డ్రగ్గిస్ట్ అంటూ దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే పబ్ యజమాన్యం, ఇతరులు కలగజేసుకుని ఇద్దరినీ శాంతింపజేసినట్లు తెలుస్తోంది. అయితే పబ్ సిబ్బంది దాడి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారి స్పందన కూడా సరిగా లేదని తెలిపింది. పబ్ తీరును ఎండగడుతూ నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.

కల్పికా గణేష్ ప్రయాణం, ఆరెంజ్, నమో వెంకటేశ, జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడి పడి లేచే మనసు, హిట్ ది ఫస్ట్ కేస్, యశోద తదతర తెలుగు సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకుంది.

Next Story