చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు సజీవ దహనం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు.

By Medi Samrat  Published on  15 May 2024 3:15 AM GMT
చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు సజీవ దహనం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. బాపట్ల జిల్లా చిన్నాగంజం నుండి హైదరాబాదుకు బయలు దేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, చిలకలూరిపేట మండలం ఈవూరి వారి పాలెం డొంక సమీపంలో ఒక టిప్పర్ ను ఢీ కొనడంతో మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, బస్ డ్రైవర్ తో పాటు నలుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెంద‌గా.. మృతుల్లో నలుగురు బాపట్ల జిల్లా చిన్నాగంజం మండలం నీలాయిపాలెం వాసులుగా చెబుతున్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకొని హైదరాబాద్ తిరిగివ‌స్తుండ‌గా ఈ ప్రమాదం చోటుచేసుకుంద‌ని ప్రాథ‌మిక స‌మాచారం.

Next Story