అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోయారు. మృతులను ప్రగతిరెడ్డి (35),అర్వీన్(6),సునీత(56)గా గుర్తించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు ప్రమాదానికి గురయ్యారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో ప్రగతిరెడ్డికి వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రగతి రెడ్డి, రోహిత్ రెడ్డి, ఇద్దరు పిల్లలు, మరియు అత్త సునీత కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రగతి, పెద్ద కుమారుడు అర్విన్, సునీత అక్కడికక్కడే మృతిచెందారు. అయితే, రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు రోహిత్ రెడ్డి నడుపుతున్నారు. ఈ విషాదకర ఘటనయ రెండు కుటుంబాల గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.