ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల గల్లంతు
Three Men Dead In Khammam. ఆదివారం కావడంతో 8 మంది యువకులు సరదాగా ఈతకు వెళ్లారు.
By Medi Samrat Published on
20 Dec 2020 12:26 PM GMT

ఆదివారం కావడంతో 8 మంది యువకులు సరదాగా ఈతకు వెళ్లారు. వారిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 8 మంది స్నేహితుల బృందం పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్ట్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిలో ఐదుగురు యువకులు నీటిలోకి దిగారు. నీటి ప్రవాహాం ఎక్కువగా ఉండడంతో వారు కొట్టుకుపోయారు.
గట్టుపైన ఉన్న వారు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కాపాడారు. మిగతా ముగ్గురు కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని జంగా గుణ(24), శీలం చలపతి(25), వేమిరెడ్డి సాయి(25)గా గుర్తించారు. ఈ ముగ్గురి యువకులది కల్లూరు మండలం బత్తలపల్లి గ్రామం. దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గజఈత గాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story