నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నల్గొండ జిల్లాలోని దేవరకొండ వద్ద డీసీఎం అత్యంత వేగంగా వచ్చి బైకును ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు ఎగిరి రోడ్డు మీద పడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉంది. మృతులు దేవరకొండ మండలం తాడికొల్ గ్రామానికి చెందిన షేక్ హాజీ కుటుంబ సభ్యులుగా గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.. పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.