విషాదం.. చెరువులో ప‌డి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Three members died in Same family fell into a Pond.వ‌రంగ‌ల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2022 4:20 PM IST
విషాదం.. చెరువులో ప‌డి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

వ‌రంగ‌ల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్య‌క్తులు చెరువులో ప‌డి ప్రాణాలు కోల్పోయారు. స్నానానికి అని దిగిన మ‌నవ‌డు మునిగిపోతుండ‌డంతో అత‌డిని రక్షించేందుకు దిగిన తాత కూడా మునిగిపోయాడు. తండ్రి, కుమారుడు మునిగిపోతుండ‌డంతో వారిద్ద‌రిని ర‌క్షించేందుకు నీటిలోకి దూకిన కుమారుడు మృతి చెందారు. ఇలా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు క్షణాల్లోనే జలసమాధి కావడంతో న‌ర్సంపేట మండ‌లం చిన్న‌గురిజాల‌లో రోద‌న‌లు మిన్నంటాయి.

వివ‌రాల్లోకి వెళితే.. చిన్న‌గురిజాల గ్రామానికి చెందిన కృష్ణ‌మూర్తి(65) అనే రైతు త‌న కొడుకు నాగ‌రాజు(34), మ‌న‌వ‌డు దీప‌క్‌(12) తో క‌లిసి గ్రామ స‌మీపంలోని చెరువు వ‌ద్ద‌కు వెళ్లారు. దీప‌క్ స్నానం చేస్తాన‌ని చెరువ‌లోకి దిగాడు. లోతు ఎక్కువ‌గా ఉండ‌డంతో దీప‌క్ మునిగిపోతుండ‌డాన్ని గ‌మ‌నించిన తాత కృష్ణ‌మూర్తి అత‌డికి ర‌క్షించేందుకు చెరువులోకి దూకాడు. అత‌డు కూడా అందులో మునిగిపోయాడు. తండ్రి, కుమారుడు చెరువులో మునిగిపోవ‌డంతో వారిని కాపాడేందుకు నాగ‌రాజు కూడా చెరువులోకి దిగాడు. చివ‌రికి అత‌డు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృతదేహాల‌ను చెరువులోంచి బ‌య‌ట‌కు తీయించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో ప‌డి మ‌ర‌ణించార‌న్న స‌మాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. వారి మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం తెలియ‌జేశారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామ‌న్నారు.

Next Story