పటాన్‌చెరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Three killed one injured in road accident in sangareddy. హైదరాబాద్‌ నగర శివారు పటాన్‌చెరు పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీ కొనడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం

By అంజి  Published on  6 Jan 2022 7:42 AM IST
పటాన్‌చెరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

హైదరాబాద్‌ నగర శివారు పటాన్‌చెరు పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీ కొనడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన ఇస్నాపూర్‌ రోడ్డు దగ్గర జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్‌ ఆటోను ఢీ కొట్టింది. టిప్పర్‌ ఢీ ధాటికి ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. ఆటోలో మృతి చెందిన వారిలో ఒకరి మృతదేహం చిద్రమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. చనిపోయిన ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరులో ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది.

ప్రమాదం సమయంలో ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన ఒకరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ సాయి బన్నన్ (35 ), తోషిబా ఉద్యోగి నర్రా తిరుమల వాసు (34), సోను (18), టప్పా కిరణ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారు సంగారెడ్డి ప్రాంతవాసులని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలియగానే సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Next Story