పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళుతున్న ఢీకొన్న శాంట్రో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో భోగెళ్ళ వెంకట సత్య సురేన్, అతని భార్య నవ్య అక్కడికక్కడే మృతి చెందగా.. వారి కుమారై నాలుగేళ్ళ చిన్నారి వాసవి కృష్ణ తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
కారులో ప్రయాణిస్తున్న మరొకరు ఉప్పులూరి శ్రీరమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరంతా హైదరాబాద్ నుండి మండపేటలోని ఏడిదకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం మేరకు ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.