సంగారెడ్డి జిల్లాలో విషాదం.. జొన్న‌రొట్టెలు తిని ముగ్గురు మృతి

Three killed Due to Food Poisoning. సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విషాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన

By Medi Samrat  Published on  22 Dec 2020 5:53 AM GMT
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. జొన్న‌రొట్టెలు తిని ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విషాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం బాధితులిద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. వివ‌రాల్లోకి వెళితే.. వ‌ట్‌ప‌ల్లి మండ‌లంలోని పల్‌వట్ల‌లో సోమ‌వారం రాత్రి ఐదుగురు కుటుంబ స‌భ్యులు జొన్న రొట్టెలు తిన్నారు. కొద్ది సేప‌టికే వారి ప‌రిస్థితి విష‌మించింది. అందులో సుశీలమ్మ, చంద్రమౌళి, శ్రీశైలం మృతి చెంద‌గా.. స‌రితా, అన‌సూయ‌ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. వెంట‌నే వీరిని చికిత్స నిమిత్తం హైద‌రాబాద్ త‌ర‌లించారు.

కాగా.. ఇదే కుటుంబానికి చెందిన శంక‌ర‌మ్మ అనే మహిళ 15 రోజుల కిందట మ‌ర‌ణించింది. శంకరమ్మ దిన కర్మలో పాల్గొవడానికి కుమారులు, కోడళ్లు వచ్చారు. చనిపోయిన మహిళ వినియోగించిన‌ పిండినే వినియోగించి కుటుంబ సభ్యులు రొట్టెలు చేసుకొని తిన్నారు. జొన్నపిండిలో విషపదార్థం కలిసినట్లు స్థానికులు అనుమానిస్తుస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.


Next Story
Share it