నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

Three killed due to electric shock In Nalgonda district. రథాన్ని భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందిన నల్గొండ జిల్లా

By Medi Samrat
Published on : 28 May 2022 3:43 PM IST

నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

రథాన్ని భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందిన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో చోటు చేసుకుంది. రామాలయం వద్ద రథాన్ని భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్‌ తగిలింది. రథాన్ని రథశాలలో భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్‌తో కేతేపల్లి గ్రామానికి చెందిన రాజాబోయిన యాదయ్య (42), పొగాకు మొనయ్య (43), మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

రథాన్ని తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముగ్గురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










Next Story