కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొత్తపల్లి మండలం బావుపేట సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మృతులను మల్లయ్య, ఓదెమ్మ, హారికగా గుర్తించారు. మానకొండూరు మండలం ముంజంపల్లి వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి బావుపేట సమీపంలో వేములవాడ వైపు వెళ్తున్న ఆటోరిక్షా బోల్తా పడడంతో బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.