ట్రాక్టర్ డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. ప్రమాదంలో ముగ్గురు మృతి

Three dead in freak tractor accident. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది. సంస్థాన్‌ నారాయణపూర్‌

By Medi Samrat
Published on : 18 March 2022 6:08 PM IST

ట్రాక్టర్ డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. ప్రమాదంలో ముగ్గురు మృతి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది. సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలం సర్వాయిల్‌ గ్రామ సమీపంలో డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ట్రాక్టర్‌ బోల్తా పడి ఓ మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ట్రాక్టర్ డ్రైవర్ ఎన్. ఎల్లయ్య (50), కూలీలు కె. సీతారాం (35), బి. గౌరి (25) ఉన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుండి వలస వ‌చ్చిన‌ కూలీలు. సంస్థాన్ నారాయణపూర్ మండలం కంకణాలగూడెంలో ఒక ఇటుక యూనిట్‌లో పనిచేస్తున్నారు.

నారాయణపూర్‌లో ఇటుకలను దించి యూనిట్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ న‌డుపుతున్న‌ డ్రైవర్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో ఒక్క‌సారిగా అదుపు తప్పింది. డ్రైవర్‌ పక్కన కూర్చున్న సీతారాం, గౌరీలు ట్రాక్టర్‌ ఇంజన్‌ భాగం కిందప‌డ‌డంతో నుజ్జునుజ్జు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.










Next Story