సెలవుల విషయంలో గొడవ.. తోటి జవాన్లపై కాల్పులు.. ముగ్గురు మృతి

Three crpf jawans killed in telangana chhattisgarh border . సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మధ్య హాలీడేస్‌ విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ జవాన్‌ జరిపిన కాల్పుల్ల ముగ్గురు జవాన్లు

By అంజి  Published on  8 Nov 2021 2:19 AM GMT
సెలవుల విషయంలో గొడవ.. తోటి జవాన్లపై కాల్పులు.. ముగ్గురు మృతి

సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మధ్య హాలీడేస్‌ విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ జవాన్‌ జరిపిన కాల్పుల్ల ముగ్గురు జవాన్లు మృత్యువాత పడ్డారు. తెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళ్తే.. మావోయిస్టులను పట్టుకునేందుకు సుక్మా జిల్లాలోని మారాయిగూడెం దగ్గర లింగంపల్లి బేస్‌ క్యాంప్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఉంటున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య సెలవుల విషయంలో గొడవ జరిగింది. దీంతో ఓ జవాన్‌ తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడగా.. భద్రచాలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దర పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన రాజుమండల్‌, బీహార్‌కు చెందిన రాజమణి యాదవ్‌, డంజి గుర్తించార. జవాన్లపై కాల్పులు జరిపిన జవాన్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని.. అతని నుండి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Next Story
Share it