Hyderabad: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తల్లి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో నివసిస్తున్న ఓ భార్య తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తాను ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on  2 Sept 2024 2:00 PM IST
Hyderabad, children, poison,suicide, Crime

Hyderabad: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తల్లి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో నివసిస్తున్న ఓ భార్య తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీలను పటాన్‌చెరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సావిత్రి (28), ఆంజనేయులు దంపతులు.. వీరికి జస్వంత్(5), చిన్మయి (3), చిత్ర (3) ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఆంజనేయులు బైక్ మెకానిక్ 2017 సంవత్సరంలో రుద్రారంకు వచ్చి ఫ్యామిలీతో సహా అక్కడే ఉంటూ ఇస్నాపూర్‌లో బైక్ మెకానిక్ పనిచేస్తున్నాడు. ఆంజనేయులు మద్యానికి బానిసై ఇంటిని అవసరాలు పట్టించుకునేవాడు. మద్యానికి బానిసైన ఆంజనేయులు తరచూ అనారోగ్యం బారిన పడేవాడు. దీంతో భార్య సావిత్రి తీవ్ర మనస్థాపానికి గురై తన పిల్లలకు విషం ఇచ్చి, తాను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story