ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో కారు చెట్టును ఢీకొని మంటలు చెలరేగడంతో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రమాద స్థలంలో ఉన్న నాల్గవ వ్యక్తి ఎవరనే విషయాన్ని నిర్ధారించేందుకు విచారణ కొనసాగుతోంది. వాహనంలో కూర్చున్న ప్రయాణికులు సజీవదహనమైన ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. రతన్‌పూర్-కోటా రహదారిపై ఉన్న చపోరాలోని పెట్రోల్ పంప్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న చెట్టును ఢీకొనడంతో కారు బూడిదైంది. ఆదివారం తెల్లవారుజామున 1:30 నుంచి 2:00 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మృతులను సమీర్ అలియాస్ షానవాజ్, ఆషికా మన్హర్, అభిషేక్ కుర్రేగా గుర్తించారు. ఘోర ప్రమాదం జరిగిన సమయంలో ఆషికా మన్హర్ కారు నడుపుతున్నట్లు సమాచారం. రతన్‌పూర్-కోటా సబ్-డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) ఆశిష్ అరోరా మాట్లాడుతూ.. "రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. బాధితులు వాహనం నుండి దిగే అవకాశం లేకపోవడంతో మంటలలో కాలిపోయారు. కారు లోపల అస్థిపంజర అవశేషాలు లభించాయి.. బాధితులను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారి తెలిపారు. వాహనం బిలాస్‌పూర్‌లోని టోర్వా ప్రాంతానికి చెందిన షానవాజ్ ఖాన్‌కు చెందినది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.