అశ్లీల వీడియోలు చూపించి.. యువకుడికి బెదిరింపులు..!

Threats to give money to a young man. ఫేసుబుక్‌లో ఓ యువకుడికి ఓ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. దానిని యువకుడు

By అంజి  Published on  14 Oct 2021 11:12 AM IST
అశ్లీల వీడియోలు చూపించి.. యువకుడికి బెదిరింపులు..!

ఫేసుబుక్‌లో ఓ యువకుడికి ఓ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. దానిని యువకుడు యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ కొన్ని రోజులకు స్నేహంగా మారింది. వీడియో కాల్స్‌లో న్యూడ్‌గా మాట్లాడుకున్నారు. అయితే కథ ఇక్కడే అడ్డం తిరిగింది. న్యూడ్ వీడియోలను అడ్డంపెట్టుకొని పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ యువకుడిని ఆ యువతి వేధింపులకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారహిల్స్‌లో నివసించే ఓ యువకుడు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన ఫేసుబుక్‌ అకౌంట్‌కి సాక్షి వర్మ అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్‌ను యువకుడు యాక్సెప్ట్ చేశాడు.

చాటింగ్‌లతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. దీంతో ఆ యువతి దుస్తులు తొలగించి మాట్లాడుతూ.. ఆ యువకుడిని కూడా అలాగే చేయమంది. యువతి చెప్పినట్లుగా అతడు చేశాడు. అతడికి తెలియకుండానే ఆ యువకుడి న్యూడ్‌ వీడియోలను యువతి రికార్డ్ చేసింది. పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని, అది కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని లేదంటే న్యూడ్ వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. అప్పటికి కొంతమందికి ఆ వీడియోను పంపించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆ యువకుడు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కేసును బంజారాహిల్స్‌ పోలీసులకు బదిలీ చేశారు.

Next Story