తండ్రి ఇంటికి కొడుకు కన్నం.. గూగుల్ హెల్ప్‌తో.!
Theft with help of google in Karimnagar. గూగుల్ అకౌంట్ సాయంతో తండ్రి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు ఓ కొడుకు, అతని భార్య. తండ్రి ఇంట్లోని
By అంజి Published on 19 Oct 2021 12:29 PM ISTగూగుల్ అకౌంట్ సాయంతో తండ్రి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు ఓ కొడుకు, అతని భార్య. తండ్రి ఇంట్లోని బీరువాలో ఉన్న ఆస్తి పేపర్లు, బంగారం, నగదును అపహరించుకుపోయాడు. కరీంనగర్ పట్టణానికి చెందినం వైకుంఠంకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వీరిలో ఇద్దరు కొడుకులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. రెండో కొడుకు కరీంనగర్‌లోనే తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే గత కొంత కాలంగా వీరి మధ్య ఆస్తుల విషయమై విబేధాలు తలెత్తాయి. దీంతో రెండో కొడుకు రవి.. తండ్రి ఆస్తిని కాజేసేందుకు కుట్ర పన్నాడు. తండ్రి వైకుంఠానికి తెలియకుండా అతని ఫోన్‌లో కాల్ రికార్డింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారు. ఆ యాప్‌ను రవి, అతని భార్య వారి గూగుల్ అకౌంట్స్‌కు లింక్ చేసుకున్నారు. అప్పటి నుండి వైకుంఠం ఏం మాట్లాడుతున్నాడో కాల్ రికార్డింగ్ యాప్ ద్వారా వినేవారు. ఇటీవల వైకుంఠం హైదరాబాద్ వస్తానని తన ఇద్దరు కొడుకులతో ఫోన్‌లో మాట్లాడాడు.
ఇంటి తాళాలు జాగ్రత్తగా దాచుకోని రావాలని కొడుకులు చెప్పగా.. వాటిని ఎవరికి తెలియని ప్రదేశంలో దాచానని వైకుంఠం వారికి ఫోన్‌లో తెలిపాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కి వెళ్లిన వైకుంఠం కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నాడు. కాల్ రికార్డింగ్ యాప్ ద్వారా తండ్రి వైకుంఠం హైదరాబాద్ వెళ్లాడని తెలుసుకున్న రెండో కొడుకు రవి.. ఇది అదనుగా భావించి దొంగతనానికి పాల్పడ్డాడు. బీరువాలో ఉన్న ఆస్తి పత్రాలు, బంగారం, నగదును అపహరించాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన వైకుంఠం బీరువా తెరిచి చూడగా.. ఆస్తి పత్రాలు, డబ్బు, బంగారం కనిపించలేదు. ఈ విషయమై వైకుంఠం లోతుగా ఆరా తీశాడు. తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన కాల్‌రికార్డింగ్ యాప్.. రవి జీమెయిల్‌కు సింక్ అయిందని తెలుసుకున్నాడు. దీంతో దొంగతనానికి పాల్పడింది. రవేనని వైకుంఠం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.