వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్లాన్‌ ప్రకారం ఓ భర్తను హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం పోలేపల్లిలో చెరువుమీది పర్వతాలు(27)కు 8 ఏళ్ల క్రితం ఉదండాపూర్‌కు చెందిన యాదమ్మతో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గరు సంతానం ఉన్నారు. భార్య యాదమ్మ పలువురితో వివాహేతర సంబంధాలు సాగించింది. ఈ క్రమంలోనే భర్త పర్వతాలు ఓ రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయాడు. దీంతో అతడు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డ వస్తున్నాడని భార్య యాదమ్మ భావించింది.

ఆ తర్వాత తన ముగ్గురు ప్రియులతో కలిసి హత్య చేసేందుకు ప్లాన్‌ గీసింది. 2021 ఫిబ్రవరి 22వ తేదీన భర్త పర్వతాలుకు తన ముగ్గురు ప్రియులతో కలిసి అతిగా మద్యం తాగించింది. దీంతో పర్వతాలు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే చున్నీతో గొంతును బిగించి హత్య చేశారు. ఆ తర్వాత రోజు ఏమీ తెలియనట్టు.. తన భర్త చనిపోయాడంటూ యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో యాదమ్మను ప్రధాన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. అలాగే పోలేపల్లికి చెందిన ఎన్నన్‌గండ్ల శివలింగం, ఎన్నన్‌గండ్ల మల్లేష్‌, గడ్డపు నాగరాజులను ప్రియురాలితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను సోమవారం రోజు అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story