షూ విషయంలో ఘర్షణ.. తమ్ముడిని హత్య చేసిన అన్న
షూ కోసం అన్న తమ్ముడిని హత్య చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By Medi Samrat Published on 6 Feb 2024 2:23 PM ISTషూ కోసం అన్న తమ్ముడిని హత్య చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మితిమీరిన ఆవేశం ఎప్పుడు అనర్ధాలకు దారితీస్తుందని పెద్దలు చెప్పిన ఆ మాట నిజమని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇద్దరూ అక్కాచెల్లెళ్ల పిల్లలు.. వరుసకు అన్నదమ్ములు అవుతారు. షూ విషయంలో గొడవ జరిగి.. హత్యకు దారి తీసింది.
సమాచారం ప్రకారం.. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహార్ లాల్ నగర్ లో నివాసం ఉంటున్న అన్న అభిషేక్ అలెక్స్.. తమ్ముడు ప్రవీణ్ మోసెస్.. వరుసకు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ముల మధ్య షూ విషయంలో ఘర్షణ చెలరేగింది. దీంతో ఆవేశానికి లోనైనా అన్న అభిషేక్ ఒక్కసారిగా దాడీకి పాల్పడ్డాడు. దీంతో తమ్ముడు ప్రవీణ్ అక్కడికక్కడే కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే దాడికి గురైన ప్రవీణ్‌ను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.