బాలికలపై వేధింపులను అడ్డుకున్నందుకు.. తండ్రిని హత్య, కుమారుడిని కత్తితో పొడిచి

The miscreants killed the father for stopping him from molesting. గుజరాత్‌లోని సూరత్‌లో నేరస్థులకు భయం లేకుండా పోయింది. నేరస్థులు ప్రతిరోజూ బహిరంగంగా నేర సంఘటనలకు

By అంజి  Published on  5 Feb 2022 7:38 AM GMT
బాలికలపై వేధింపులను అడ్డుకున్నందుకు.. తండ్రిని హత్య, కుమారుడిని కత్తితో పొడిచి

గుజరాత్‌లోని సూరత్‌లో నేరస్థులకు భయం లేకుండా పోయింది. నేరస్థులు ప్రతిరోజూ బహిరంగంగా నేర సంఘటనలకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లోని డైమండ్ సిటీ సూరత్‌లో వేధింపులకు పాల్పడకుండా అడ్డుకున్నందుకు కత్తితో పొడిచి చంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సమాచారం ప్రకారం, సూరత్‌లోని లింబయత్ ప్రాంతంలో కొంతమంది దుర్మార్గులు బహిరంగంగా బాలికలను వేధిస్తున్నారు. లింబయత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వత్‌గామ్ రాంచోడ్ నగర్‌లో నివాసం ఉంటున్న శివ భాయ్ నికమ్ తన కుమారుడు యశ్వంత్ సింగ్ నికమ్ (22), అతని స్నేహితుడితో కలిసి వెళ్తున్నాడు.

అయితే అదే సమయంలో తండ్రీకొడుకులు బాలికలపై వేధింపులకు పాల్పడకుండా దుండగులను అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన దుండగులు తండ్రీకొడుకులపై దాడి చేశారు. యశ్వంత్‌పై దుండగులు కత్తితో దాడి చేయడం ప్రారంభించారు. కుమారుడిపై దాడి చేయడం చూసిన తండ్రి శివభాయ్ అతడిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. ఆ తర్వాత శివ భాయ్‌పై దుండగులు ఒకరి తర్వాత ఒకరు కత్తులతో చాలాసార్లు దాడి చేశారు. శివ భాయ్ చనిపోయే వరకు దుండగులు దాడి చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ సందర్భంగా చుట్టుపక్కల గుమిగూడిన జనం మూగ ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ఎవరూ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించలేదు.

Next Story
Share it