జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో దొంగతనం ఆరోపణలపై పట్టుబడిన వ్యక్తిని ప్రజలు కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన నిందితుడిని గ్రామస్థుల నుండి విడుదల చేసి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఆ వ్యక్తిని ప్రజలు పట్టుకున్నారు. సోమవారం ఉదయం ఆ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. మొబైల్ షాపులో దొంగతనం చేసి తప్పించుకున్నాడని ఆ వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి. ఉదయానే లేచిన ఒక మహిళ దొంగలు పారిపోవడాన్ని చూసింది. మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు మేల్కొన్నారు. అనంతరం ఆ వ్యక్తిని వెంబడించి పట్టుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తిని 'మామూ' గా గుర్తించారు. అతను పక్క ఊరికి చెందిన వాడు. ప్రజలు పట్టుకున్నాక అతడిని అర్ధనగ్నంగా ఉంచారు. అతన్ని వేలాడదీసి నిర్దాక్షిణ్యంగా కొట్టారు. దొంగిలించబడిన ఫోన్, ఇతర వస్తువులను ఆ వ్యక్తి నుండి స్వాధీనం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ వీడియో వైరల్ కావడంతో రాధా నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై మనోజ్ కుమార్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల నుంచి ఆ వ్యక్తిని విడిపించి రాధా నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌లో దొంగతనంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన తర్వాత ఫిర్యాదుపై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.