కోడలి ముఖంపై వేడివేడి నూనె పోసిన అత్తామామ

The in-laws poured hot oil on the daughter-in-law's face in MP. పెళ్లి అయ్యి ఆరేళ్లయినా సంతానం కలగలేదని, మరింత కట్నం తీసుకురావాలని మహిళను.. ఆమె భర్త, అత్తమామలు

By అంజి  Published on  9 July 2022 12:08 PM IST
కోడలి ముఖంపై వేడివేడి నూనె పోసిన అత్తామామ

పెళ్లి అయ్యి ఆరేళ్లయినా సంతానం కలగలేదని, మరింత కట్నం తీసుకురావాలని మహిళను.. ఆమె భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలోనే మహిళ తన మంచంపై నిద్రిస్తున్న సమయంలో భర్త, అత్తమామలు వేడి వేడి నూనెను ఆమె ముఖంపై పోశారు. దీంతో ఆ మహిళ ముఖం మొత్తం కాలిపోయింది. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పర్వాలియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భోపాల్‌లోని పర్వాలియా ప్రాంతంలోని మొహల్లా జిర్నియాలో 20 ఏళ్ల యువతి నివసిస్తోంది. ఆమెకు 6 సంవత్సరాల క్రితం ప్రతాప్ బంజారాతో వివాహమైంది. పెళ్లయ్యాక మూడేళ్ళ పాటు తల్లి ఇంట్లోనే ఉంది. మూడేళ్ల కిందట తిరిగి అత్తమామల ఇంటికి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆమెకు అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. సంతానం కలగట్లేదని అత్తమామలు ఆమెను తిట్టడం మొదలుపెట్టారు. దీంతో ఇంట్లో గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం రాత్రి మహిళ రాత్రి భోజనం చేసి గదిలో పడుకుంది. ఈ క్రమంలోనే నిద్రిస్తున్న మహిళపై భర్త, అత్తమామలు వేడి నూనె పోశారు. వేడి నూనె పడటంతో వివాహిత ముఖం కాలిపోయింది. ఈ విషయమై విచారణ జరుపుతున్నట్లు పార్వలియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గిరీష్ త్రిపాఠి తెలిపారు.

Next Story