బీహార్‌లోని పాట్నాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు ఓ భార్య తన చెల్లిని.. తన భర్తకు ఇచ్చి వివాహం చేసింది. ఆ తర్వాత తన ప్రియుడి దగ్గరకు వెళ్లింది. దీని తరువాత కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. కానీ ఒక రోజు అకస్మాత్తుగా యువతిని ప్రియుడు విడిచిపెట్టి పారిపోయాడు. దీంతో ఆ యువతి లబోదిబోమంటూ తన చెల్లెలి దగ్గరకు వచ్చింది. తన భర్తను తిరిగి ఇవ్వాలంటూ చెల్లెలితో యువతి గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదం పెరిగి విషయం పాట్నాలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరింది. బిహార్‌లోని పాట్నాలో పని చేస్తున్న యువతికి ఓ యువకుడితో పరిచచం ఏర్పడింది.

మొదట ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే ఆ యువతికి అదే సమయంలో వేరే యువకుడితో పెళ్లయింది. ఆ యువతికి పెళ్లయిపోయింది కానీ.. తన ప్రేమికుడిని మాత్రం మర్చిపోలేకపోయింది. ఒక రోజు ఆమె తన ప్రేమికుడి వద్దకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి తన భర్తను తన చెల్లెలికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఎలాగోలా తన చెల్లెల్ని ఒప్పించింది. ఇద్దరికీ పెళ్లి అయిన తర్వాత ఆమె తన ప్రేమికుడితో కలిసి జీవించడం ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రేమికుడు ఆమెను విడిచిపెట్టడంతో.. ఆమె తన భర్త వద్దకు తిరిగి రావాలని నిర్ణయించుకుంది. కానీ దానికి ఆమె చెల్లెలు అంగీకరించడం లేదు. దీంతో వీరి గొడవ మహిళ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story