'నాన్న.. నేను స్నానానికి వెళ్తున్నాను..' అని చెప్పి వెళ్లింది..

The daughter hanged herself in the bathroom. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్ బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు

By M.S.R  Published on  3 Feb 2022 7:34 AM GMT
నాన్న.. నేను స్నానానికి వెళ్తున్నాను.. అని చెప్పి వెళ్లింది..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్ బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. స్నానం చేయడానికి బాత్‌రూమ్‌కి వెళ్లిన ఆమె అక్కడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాన్న, నేను స్నానానికి వెళ్తున్నాను అని తండ్రికి చెప్పింది. అలా వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. అనుమానం వచ్చి తలుపు పగులగొట్టారు.. ఆ తర్వాత మృతదేహాన్ని వెలికితీశారు. భన్వర్కువాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రమేష్ సోలంకి కుమార్తె నందిని (26) ఫ్యాషన్ డిజైనర్. రమేష్ సోలంకి జాంబియాలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నందిని తల్లి ఆరోగ్యం ఇటీవల విషమించడంతో రమేష్ జాంబియా నుండి 4 రోజుల క్రితం ఇండోర్ వచ్చారు. ఇంతలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్యకి ముందు నందిని తన తండ్రితో చివరిసారి మాట్లాడిందని పోలీసులు తెలిపారు. 'నాన్న నేను స్నానం చేయడానికి బాత్ రూంకి వెళ్తున్నాను' అని చెప్పింది. చాలా సేపటికి కూడా నందిని బాత్‌రూమ్‌ నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. పిలిచినా కానీ సమాధానం లేదు. బాత్‌రూమ్‌ గేటు పగులగొట్టి చూడగా నందిని మృతదేహం వేలాడుతూ ఉంది. కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.

నందిని ఎందుకు అలా చేసిందో ఎవరికీ తెలియదని ఆమె తల్లి ఏడుస్తూ చెప్పింది. సూసైడ్ నోట్‌లో నా ఇష్టపూర్వకంగానే ఈ చర్య తీసుకుంటున్నట్లు మాత్రమే రాసి ఉంది. ఆదివారం కుటుంబంతో గడిపిన ఆమె గంటల తరబడి నవ్వుతూ ఉందట. కుటుంబంలో కూడా ఎలాంటి గొడవలు లేవని బంధువులు తెలిపారు. నందిని మొబైల్‌ కాల్‌ వివరాలను సేకరించడమే కాకుండా ఆమె స్నేహితులను కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.


Next Story
Share it