మూసీ తీరంలో దారుణ హత్య
మూసీ నది ఒడ్డున దారుణ హత్య జరిగింది. 28 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.
By Medi Samrat Published on 4 Jan 2025 6:06 PM ISTమూసీ నది ఒడ్డున దారుణ హత్య జరిగింది. 28 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. దుండగులు శుక్రవారం రాత్రి మహమ్మద్ నబీని బాపునగర్ అంబర్‌పేటలోని అతని ఇంటి నుంచి బైక్‌పై కిడ్నాప్ చేశారు. అనంతరం మూసీ నది వద్దకు అతడిని తీసుకెళ్లి బాకుతో పలుమార్లు పొడిచి, అనంతరం బండరాయితో తలపై మోదారు. ఈ దాడిలో నబీ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి నిందితులు పారిపోయారని ఉప్పల్ పోలీసులు తెలిపారు.
బాధితుడు నబీకి తెలిసిన ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గత వివాదాల కారణంగానే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. మూసీ నది ఒడ్డుకు వెళ్లి అతడిని ఇద్దరు కలిసి దారుణంగా హత్య చేశారు. బాధితుడు, నిందితులు బంధువులని సమాచారం. కుటుంబ కలహాలతో తాతను హత్య చేసిన కేసులో నబీ ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు.
హత్యలో అతని బంధువు జాకీర్‌తో పాటు మరో ఇద్దరు దుండగులు ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, బాపునగర్‌లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ముగ్గురు అనుమానితులను గుర్తించి, విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాధితుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించారు.