హృదయవిదారకం.. అమ్మ మరణించిందని తెలియక.. నాలుగు రోజులుగా
Ten year old Kid not identified mother death since last 4 days in Tirupati.తల్లి చనిపోయిందనే విషయం తెలియక
By తోట వంశీ కుమార్ Published on 12 March 2022 5:18 AM GMT
తల్లి చనిపోయిందనే విషయం తెలియక ఆమె కుమారుడు మృతదేహంతోనే నాలుగు రోజులుగా ఉంటున్నాడు. ఇంట్లో ఉన్న తినుబండారాలు తింటూ పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు. రాత్రి సమయంలో తల్లి మృతదేహం పక్కనే నిద్రిస్తున్నాడు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజ్యలక్ష్మి అనే మహిళ భర్తతో విభేదాల నేపథ్యంలో పదేళ్ల కుమారుడు శ్యామ్ కిషోర్‌తో కలిసి విద్యానగర్‌లో నివసిస్తోంది. ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది.
ఈ క్రమంలో ఈ నెల(మార్చి) 8వ తేదీన ఇంట్లో రాజలక్ష్మి కిందపడి మృతిచెందింది. అయితే.. అమ్మ నిద్రపోతుందని శ్యామ్ కిషోర్ బావించాడు. ఇంట్లో ఉన్న తినుబండారాలను తింటూ నాలుగు రోజులుగా పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు. మంచం పక్కన తల్లి మృతదేహంతోనే పడుకుంటున్నాడు. వారి ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు శ్యామ్ కిషోర్ మేనమామ దుర్గాప్రసాద్‌కు సమాచారం అందించారు. ఆయనొచ్చి చూడగా అసలు విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. శ్యామ్ మానసిక స్థితి సరిగ్గా లేదని మేనమామ దుర్గాప్రసాద్ తెలిపారు.