యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వచ్చాడు.. తీరా..!

Telugu Artist Held for Stealing Cameras Rented Through OLX. ఏపీలోని తిరుపతి జీవకోనకు చెందిన చుంచు ప్రవీణ్‌ కుమార్‌‌ అలియాస్‌ తేజ అలియాస్​ కల్యాణ్(32)

By Medi Samrat  Published on  17 Aug 2021 11:32 AM GMT
యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వచ్చాడు.. తీరా..!

ఏపీలోని తిరుపతి జీవకోనకు చెందిన చుంచు ప్రవీణ్‌ కుమార్‌‌ అలియాస్‌ తేజ అలియాస్​ కల్యాణ్(32) యాక్టింగ్‌పై ఇష్టంతో హైదరాబాద్‌ వచ్చాడు. యూసుఫ్‌గూడలో ఓ యాక్టింగ్‌ అకాడమీలో చేరి సీరియల్స్‌, సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్​గా నటిస్తూ ఉన్నాడు. పోలీస్‌ క్యారెక్టర్‌స్ కూడా ‌చేసేవాడు. యూ ట్యూబ్‌ ఛానల్‌లో కొంతకాలం క్రైమ్‌ రిపోర్టర్‌‌గా పని చేశాడు. సినిమా షూటింగ్స్‌లో వాడే కెమెరాల గురించి తెలుసుకొని వాటిని కొట్టేయాలని.. అమ్మితే పెద్ద ఎత్తున డబ్బులు వచ్చేవని భావించాడు.

ఇక ఓఎల్‌ఎక్స్‌లో రెంటల్ కెమెరాలను టార్గెట్‌ చేశాడు. కాల్‌ చేసి కెమెరాలు రెంట్‌కి తీసుకునేవాడు. ఇందుకోసం ఆధార్‌‌ కార్డ్, యూట్యూబ్ ​చానెల్​ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జిరాక్స్‌ కాపీలు ఇచ్చేవాడు. దీంతో పాటు కెమెరా అసిస్టెంట్‌, టీవీ చానల్స్​లో రిపోర్టర్‌‌గా జాబ్‌ ఇప్పిస్తానని యువకులను ట్రాప్ చేసి వారి వద్ద ఉన్న కెమెరాలను కొట్టేస్తూ వచ్చాడు. ఇలా ఈ ఏడాది 10 కెమెరాలు కొట్టేశాడు. తాజాగా అలా చేస్తూ చేస్తూ.. పోలీసులకు దొరికిపోయాడు. తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన11 మందిని మోసం చేశాడని వెస్ట్​జోన్ డీసీపీ ఏఆర్‌‌ శ్రీనివాస్ తెలిపారు.

పంజాగుట్ట పీఎస్ లిమిట్స్​లో మూడు కేసులు రిజిస్టర్‌‌ అయ్యాయని, ప్రవీణ్‌కుమార్‌‌ను అరెస్ట్ చేసి10 కెనాన్ కెమెరాలతో పాటు ల్యాప్‌ టాప్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తి కాస్తా ఇలా కెమెరాల దొంగ అయ్యి.. కటకటాల పాలయ్యాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడితే ఇలా జైలు పాలవ్వక తప్పదని పోలీసులు హెచ్చరించారు.


Next Story
Share it