మైనర్‌ బాలికపై అత్యాచారం.. అడ్డుకున్న తండ్రిపై దారుణంగా దాడి

Teenage Sexual assault in Baghpat. దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు

By అంజి  Published on  19 Jan 2022 3:51 PM IST
మైనర్‌ బాలికపై అత్యాచారం.. అడ్డుకున్న తండ్రిపై దారుణంగా దాడి

దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. కామంతో కళ్లుమూసుకుపోయి.. కొందరు మానవ మృగాలు దారుణాలకు తెగబడుతున్నారు. అడ్డొచ్చిన వారిపై అతిక్రూరంగా దాడి చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో జరిగిన మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్‌ బాలిక తన ఇంటి బయటే అత్యాచారానికి గురైంది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక తన తండ్రి, తమ్ముడితో కలిసి నివసిస్తోంది. ఆమె తన ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది.

నిందితుడు తన కుమార్తెను ఇంటి నుంచి బయటకు లాగి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో వెల్లడించాడు. బాలిక అరుపులు విన్న తండ్రి అక్కడికి చేరుకుని 45 ఏళ్ల నిందితుడితో గొడవ పడ్డాడు. నిందితుడు మైనర్ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా.. నాటు తుపాకీతో బాలిక తండ్రిని దారుణంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత బాధితురాలి తండ్రిని బెదిరించి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సామాజిక అపకీర్తికి భయపడి కుటుంబసభ్యులు మొదట్లో ఫిర్యాదు చేయకపోగా, ఆ తర్వాత తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్పీ కార్యాలయంలో కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Next Story