మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి యువతి ఆత్మహత్య
మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 29 Jan 2025 10:11 AM ISTమరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో 17 ఏళ్ల బాలిక 'మరణం తర్వాత ఏమి జరుగుతుంది' అని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఓ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతుందని.. ఆ అమ్మాయి నాగ్‌పూర్‌లోని ఆర్‌బీఐ ప్రాంతీయ డైరెక్టర్‌కి ఉన్న ఏకైక సంతానం అని పోలీసులు తెలిపారు.
ఆమె తరచుగా మరణం గురించి, విదేశీ సంస్కృతుల గురించిన సమాచారం కోసం ఇంటర్‌నెట్‌లో శోధించింది. ఆమె మొదట తన మణికట్టును కత్తితో కోసుకుందని.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన 'స్టోన్ బ్లేడ్ నైఫ్'తో క్రాస్ మార్కులు వేసుకుని.. అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో ఛత్రపతి నగర్ ప్రాంతంలోని తమ ఇంట్లోని బెడ్‌రూమ్‌లో యువతి రక్తంతో తడిసి ఉన్నట్లు మృతురాలి తల్లి గుర్తించి అరవడం మొదలుపెట్టిందని పోలీసులు తెలిపారు.
ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని.. దానిని పరిశీలించగా.. ఆమె 'మరణం తర్వాత ఏమి జరుగుతుంది' అనే సమాచారాన్ని గూగుల్‌లో శోధిస్తున్నట్లు తేలిందని ధంతోలి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. తన డైరీలలో విదేశీ సంస్కృతుల గురించి విస్తృతంగా రాసుకుదని తెలిపారు.
విచారణలో బాలికకు యూరోపియన్ సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి ఉందని.. ఆమె కొంతకాలంగా మరణంపై పరిశోధన చేస్తుందని పోలీసులకు తెలిసింది. కొన్ని వారాలుగా ఆమె ఆత్మహత్యకు ప్లాన్ చేసుకున్నట్లు ఇది సూచిస్తుంది. మృతదేహాన్ని పరిశీలించగా.. బాలిక మణికట్టుపై ఐదు కోతలు ఉన్నాయని.. అందులో రెండు క్రాస్ మార్కులు ఉన్నాయని.. ఆపై ఆమె గొంతు కోసుకుందని పోలీసులు గుర్తించారు. బాలిక ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైందని, మరణం, విదేశీ సంస్కృతికి సంబంధించిన సమాచారాన్ని తరచుగా వెతుకుతున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారి తెలిపారు.
అతను తన ప్రాణాలను తీసుకోడానికి ఉపయోగించిన బ్లేడ్, చెక్క హ్యాండిల్ ఉన్న కత్తి స్థానిక మార్కెట్‌లో అందుబాటులో లేదని చెప్పారు. బాలిక ఆన్‌లైన్‌లో కత్తిని ఆర్డర్ చేసి ఉండవచ్చని.. ఆమె సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నామని అధికారి తెలిపారు. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఇంటి కింది ప్లోర్‌లో ఉంటుండగా.. ఆమె మామ కుటుంబం, అమ్మమ్మ మొదటి అంతస్తులో నివసిస్తున్నారు. ధంతోలి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.