నాలుగ‌వ త‌ర‌గ‌తి బాలికపై టీచ‌ర్‌ లైంగిక వేధింపులు

Teacher sexually abused a fourth class girl. నాలుగ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌ను టీచ‌ర్‌ లైంగికంగా వేధిస్తున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

By Medi Samrat  Published on  8 July 2023 8:09 PM IST
నాలుగ‌వ త‌ర‌గ‌తి బాలికపై టీచ‌ర్‌ లైంగిక వేధింపులు

నాలుగ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌ను టీచ‌ర్‌ లైంగికంగా వేధిస్తున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. సికింద్రాబాద్ లోని ముషీరాబాద్ లో ఈ దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తొమ్మిది సంవత్సరాల బాలిక ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నది. అదే స్కూల్లో రాజ్‌కుమార్ అనే వ్యక్తి టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ గురువు చిన్నారి బాలికను లైంగిక వేధింపు లకు గురి చేస్తూ ఉన్నాడు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పుకోలేక.. ఇటు ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేయలేక.. కొన్ని నెల‌లుగా ఇబ్బందులు ప‌డుతుంది.

టీచ‌ర్‌ లైంగిక వేధింపులు మితిమీరి పోవడంతో బాధితురాలు భరించలేకపోయింది. భయంతో స్కూలుకు వెళ్లన‌ని మారాం చేసేది. తనను స్కూల్ మార్చాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. ఆ స్కూలుకు వెళ్ళనని.. స్కూలుకు మార్చాలంటూ బాలిక ప‌ట్టుప‌ట్టింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. పాపను అడిగారు. బాలిక‌ తల్లిదండ్రులకు విష‌య‌మంతా వివరించింది. ఆగ్రహంతో తల్లిదండ్రులు వెంటనే స్కూలుకు చేరుకుని టీచర్ కు దేహ శుద్ధి చేశారు. అనంత‌రం ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story