బెంగుళూరులో ఓ ఉపాధ్యాయుడు ఆరో తరగతి విద్యార్థిని కొట్టిన ఉదంతం చివరికి పోలీసు స్టేషన్ దాకా వెళ్ళింది. స్కూల్ లో ఓ విద్యార్థిని నియంత్రించే ప్రయత్నంలో కర్రతో ఉపాధ్యాయుడు కొట్టడంతో ఆ పిల్లాడి పన్ను రాలిపోయింది.
ఓ పిల్లాడికి బుద్ధి చెప్పాలని చేసిన ప్రయత్నంలో పిల్లాడి పన్ను రాలిపోయింది. దీంతో బాధిత పిల్లాడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇక పోలీసులు జువైనల్ జస్టిస్ యాక్ట్, ఇతర వర్తించే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పిల్లాడిని కొట్టడానికి ఉపయోగించిన కర్ర, విరిగిన పంటితో సహా సాక్ష్యాలను పోలీసుల ముందు ఉంచారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని ఉపాధ్యాయుడు చెబుతున్నారు.
జయనగర్ IV బ్లాక్‌లోని హోలీ క్రైస్ట్ ఇంగ్లీషు స్కూల్‌లో గురువారం విద్యార్థి, అతని సహవిద్యార్థులు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఉండగా, కొన్ని నీళ్లు హిందీ ఉపాధ్యాయుడు అజ్మత్ దుస్తులపై పడింది. కోపోద్రిక్తుడైన అజ్మత్ బాలుడిని కొట్టాడు. అతని పన్ను విరిగిపోయింది.