వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు

సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 19 Jun 2025 6:07 PM IST

వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు

సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిసల్‌బండ వద్ద కొన్ని రోజులుగా ముగ్గురు మహిళలు ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తునట్లు సమాచారం అందిందన్నారు. బుధవారం రాత్రి సౌత్‌ ఈస్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి ముగురు మహిళలను, ఒక‌ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ బైక్‌ను కూడా సీజ్ చేసి సంతోష్ న‌గ‌ర్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story