ఓ కస్టమర్ ఏడుస్తూ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఎలుకల మందు ఆర్డర్ చేసినట్లు అనిపించడంతో.. అర్థరాత్రి ఎలుకల మందు ఆర్డర్ డెలివరీ చేయడానికి నిరాకరించాడు ఓ బ్లింకిట్ డెలివరీ కార్మికుడు. ఈ విషయాన్ని షేర్ చేసిన ఆ బ్లింకిట్ డెలివరీ కార్మికుడు సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతున్నాడు.
"ఆమె ఏడుస్తూనే ఉంది" అని డెలివరీ ఏజెంట్ వీడియోలో షేర్ చేశాడు. నేను ఆమె దగ్గరకు వెళ్లి, మీకు ఏ సమస్య ఉన్నా, ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పాను. నేను ఆమెను అడిగాను, 'మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని ఆర్డర్ చేశారా? అని.. ఆమె 'లేదు బ్రో అలా కాదు' అని సమాధానం ఇచ్చింది. నేను 'లేదు, అబద్ధం చెప్పకండి. మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు. మీకు ఎలుకల సమస్య ఉంటే.. మీరు దానిని ఏడు గంటల ప్రాంతంలో లేదా అంతకు ముందే ఆర్డర్ చేసి ఉండేవారు. బహుశా మరుసటి రోజు చేసేవారు. ఈ సమయంలో దీనిని ఆర్డర్ చేయడానికి ఏ కారణం లేదు.. తొందరపడి ఏమీ చేయవద్దని ఆ మహిళను ఒప్పించి, ఆర్డర్‌ను రద్దు చేసిన తర్వాత ఎలుకల మందును డెలివరీ చేయకుండా తిరిగి వచ్చానని చెప్పాడు. ఈరోజు నేను ఏదో సాధించానని నాకు అనిపిస్తోంది అని అతను పేర్కొన్నాడు.
కామెంట్స్ విభాగంలో చాలా మంది కూడా తన భావోద్వేగాన్ని పంచుకున్నట్లు అనిపించింది. వీడియోలలో అతని పేరు స్పష్టంగా లేనప్పటికీ డెలివరీ ఏజెంట్‌గా అతను తన రోజువారీ జీవిత అనుభవాలను. ఆలోచనలను క్రమం తప్పకుండా పంచుకుంటున్నట్లు అనిపిస్తుంది.