బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అతను మాట్లాడటం లేదని..

Suspicious death of B.Tech student. కృష్ణా జిల్లాలో బీటెక్‌ విద్యార్థిని రోహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి

By అంజి  Published on  4 Nov 2021 3:57 AM GMT
బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. అతను మాట్లాడటం లేదని..

కృష్ణా జిల్లాలో బీటెక్‌ విద్యార్థిని రోహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాట్రాయి మండలం సూరంపాలెంకు చెందిన రోహిత (21) బీటెక్‌ చదువుతోంది. విజయవాడ కానూరులోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతోన్న రోహిత.. కాలేజీ సమీపంలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటోంది. విద్యార్థిని సోమవారం నాడు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసింది. అదే కాలేజీకి చెందిన విద్యార్థితో తనకు సంవత్సర కాలంగా మనస్పర్థలు వచ్చాయని చెప్పింది.

తనతో ఆ విద్యార్థి మాట్లాడటం లేదని కుటుంబ సభ్యులతో ఆవేదన చెందుతూ మట్లాడింది. దీంతో తల్లిదండ్రులు.. దిగులు పడవద్దని, తాము మాట్లాడతామంటూ కుమార్తెకు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజు తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తున్నా విద్యార్థిని ఎంతకు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. విద్యార్థిని కుటుంబ సభ్యుల్లో ఒకరు మంగళవారం రాత్రి హాస్టల్‌కు వచ్చి చూశారు. హాస్టల్‌ రూమ్‌లో రోహిత ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని విగత జీవిలా కనబడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కానూరు వచ్చారు. రోహి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story
Share it