Hyderabad: నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రెడ్‌ స్టోన్‌ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది.

By అంజి  Published on  16 Sept 2024 9:34 AM IST
Suspicious death, nursing student, Gachibowli, Hyderabad, Crime

Hyderabad: నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా? 

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రెడ్‌ స్టోన్‌ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఆమెపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిల్స్‌ పడి ఉండటంతో ఆమె మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

మృతురాలు జడ్చర్లకు చేందిన శృతి (23)గా పోలీసులు గుర్తించారు. ఆమె గతంలో యశోద ఆస్పత్రిలో నర్సుగా పని చేసింది. గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్‌ ఫ్యానుకు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి, ఆమె స్నేహితురాలు.. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రెడ్ స్టోన్ హోటల్ లో రెండు గదులు తీసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈరోజు ఉదయం గదిలో శృతి ఫ్యాన్ కు ఊరేసుకుని కనిపించింది. కూతురు మరణించడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు డెడ్ బాడీని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా శృతి బంధువులు అడ్డుకున్నారు. డెడ్ బాడీ తో హోటల్ ముందు శృతి బంధువులు ఆందోళన చేపట్టారు.రేప్ అండ్ మర్డర్ ను ఆత్యహత్యగా చిత్రీకరిస్తున్నారనీ బంధువుల ఆరోపించారు. క్లూస్ టీం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు హోటల్లో ఉన్న సిసి టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

ఘటనా స్థలిలో పెద్ద ఎత్తున బీరు బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గదిలో మొత్తం ముగ్గురు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గది మొత్తం చిందర వందరగా ఉండడంతో ఆ రూమ్ లో ఉన్న వారి మధ్య గొడవ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కూతురుపై అత్యా చారం చేసి హత్య చేశారని యువతి తల్లిదండ్రులు అంటున్నారు.

Next Story