చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీ ఆత్మహత్య
Suicide At Cherlapally Central Jail. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం బయటకు వచ్చింది.
By Medi Samrat Published on
18 July 2021 9:30 AM GMT

హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం బయటకు వచ్చింది. ఓ హత్య కేసులో బానోత్ శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి చర్లపల్లి జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా గత రెండు రోజులుగా జైలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ ఏమైందో ఏమో కానీ ఆసుపత్రి లోని బెడ్ షీట్ సహాయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది జైలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 2019లో సూర్యాపేటలో జరిగిన హత్య కేసులో శ్రీనివాస్ నిందితుడు. ఖైదీ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story