బుధవారం యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి తన సహవిద్యార్థులతో గొడవపడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణానగర్‌లోని సాయికృపా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి తన స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్లు సమాచారం. అయితే.. నలుగురు సభ్యుల బృందం మధ్య వాగ్వాదం జరిగింది. అది చివరికి గొడవకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది గాయపడిన విద్యార్ధిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.