పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థి.. ముసుగులేసుకుని వచ్చి కొట్టి చంపేశారు

పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. పాట్నా లా కాలేజీలో సోమవారం ఓ కాలేజీ విద్యార్థిని కొందరు దుండగులు కొట్టి చంపారు.

By Medi Samrat  Published on  28 May 2024 5:57 AM GMT
పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థి.. ముసుగులేసుకుని వచ్చి కొట్టి చంపేశారు

పరీక్ష రాయడానికి వెళ్లిన విద్యార్థిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. పాట్నా లా కాలేజీలో సోమవారం ఓ కాలేజీ విద్యార్థిని కొందరు దుండగులు కొట్టి చంపారు. మృతుడు వైశాలి జిల్లాకు చెందిన హర్ష్ కుమార్ (22) గా గుర్తించారు. పాట్నాలోని బిఎన్ కాలేజీ విద్యార్థి. పరీక్షకు హాజరయ్యేందుకు పాట్నా లా కాలేజీకి వెళ్లాడు. నిర్ణీత సమయానికి ముందే హర్ష్ పరీక్ష హాలు నుంచి వెళ్లిపోయాడని, ఆ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అతడిని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్)కి తరలించగా.. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

విద్యార్థి రాజకీయాలలో హర్ష్ ప్రమేయం ఉందని, గతంలో జరిగిన పోటీల ఫలితంగా ఈ గొడవ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు పాట్నా అదనపు పోలీసు సూపరింటెండెంట్ శరత్ ఆర్‌ఎస్ తెలిపారు. "సాధ్యమైన అన్ని కోణాలను పరిశీలిస్తున్నాము. నిందితులను గుర్తించడం కోసం మేము నేరం జరిగిన ప్రదేశంలోనూ, చుట్టుపక్కల అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను స్కాన్ చేస్తున్నాము" అని చెప్పారు. క్యాంపస్‌లో భద్రతా సిబ్బందిని ప్రస్తుతం మోహరించారు.

Next Story