ఇంటి బయట ఆడుకుంటున్న బాలికపై వీధికుక్క దాడి.. పరిస్థితి విషమం

Stray dog brutally attacks girl, bites off her face in Gujarat’s Surat. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని హన్స్‌పురా సొసైటీలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను

By M.S.R  Published on  9 Jan 2023 5:33 PM IST
ఇంటి బయట ఆడుకుంటున్న బాలికపై వీధికుక్క దాడి.. పరిస్థితి విషమం

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని హన్స్‌పురా సొసైటీలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను వీధికుక్క దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. కుక్క మైనర్‌ బాలిక చెంపపై గాయాన్ని చేసింది. బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాలిక ముఖంపై చాలా కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. కుక్క బారి నుంచి బాలికను ఆమె తల్లి రక్షించింది. ఈ క్రమంలో తల్లిని కూడా కుక్క కరిచింది.

ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. బాలిక ఇంటి బయట ఆడుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఆ తర్వాత కుక్క ఆమెపై వెనుక నుంచి దాడి చేసింది. కుక్క దాడికి బాలిక కిందపడిపోయింది. అయినా ఆ కుక్క బాలికను విడిచిపెట్టలేదు. చిన్నారి ఏడుపు విని ఆమె తల్లి బయటకు వచ్చింది. తల్లీ కూతుళ్లు అక్కడి నుంచి వెళుతుండగా.. కుక్క హిళపై వెనుక నుంచి దాడి చేసింది. కానీ ఆ మహిళ కుక్కను తరిమికొట్టింది.


Next Story