శంషాబాద్‌లో దారుణం.. కన్నతండ్రిని నరికి చంపిన క‌సాయి కొడుకు

కన్నతండ్రిని కన్న కొడుకే అతి దారుణంగా చంపేశాడు. తండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది

By M.S.R  Published on  5 Oct 2024 11:30 AM IST
శంషాబాద్‌లో దారుణం.. కన్నతండ్రిని నరికి చంపిన క‌సాయి కొడుకు

కన్నతండ్రిని కన్న కొడుకే అతి దారుణంగా చంపేశాడు. తండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంద్రనగర్ దొడ్డి కాలనీలో వ్యక్తిని హత్య చేశారని సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి ఆకుల రాములు (55)గా గుర్తించారు.

విచారణలో కొడుకే చంపేశాడని తేలింది. శుక్రవారం రాత్రి ఆకుల రాములు అతని కొడుకు ఆకుల శివ కుమార్ మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. తండ్రిపై కొడుకు ఆకుల శివ కుమార్ గొడ్డలితో దాడి చేశాడు. ఈ సమయంలో తీవ్రంగా గాయపడ్డ రాములు అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు పోలీసులు.

Next Story