కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. అన్నం ఆలస్యంగా పెట్టిందని మాతృమూర్తిని కొట్టి చంపాడు. వివరాళ్లోకెళితే.. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని చైబాసాలోని మనోహర్‌పూర్ బ్లాక్ పరిధిలోని జోజోగుట్టు గ్రామంలో ప్రధాన్ సోయి (35) తన తల్లి సుమి(60)తో కలిసి నివసిస్తున్నాడు.
మనోహర్‌పూర్ ఎస్‌డిపిఓ విమలేష్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం.. రోజూ మద్యం తాగే అలవాటున్న ప్రధాన్.. శుక్రవారం రాత్రి కూడా పీకలదాకా తాగి ఇంటికొచ్చాడు. మద్యం మత్తులో ఉన్న ప్రధాన్ తనకు అన్నం పెట్టాలని తల్లి సుమిని కోరాడు. రాత్రి సమయం కావడంతో తల్లి అన్నం పెట్టడం కాస్త ఆలస్యం అయ్యింది. దాంతో కోపంతో ఊగిపోయిన ప్రధాన్.. కర్రతో తల్లిపై దాడిచేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగాయపడి అక్కడికక్కడే చనిపోయింది.
అయితే.. విషయం తెలిస్తే పోలీసులు అరెస్టు చేస్తారని భయపడిన ప్రధాన్.. తల్లి శవాన్ని ఇంటి పరిసరాల్లోనే పూడ్చి పెట్టాలని చూశాడు. అది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. పవన్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.