అత్తని బావిలోకి తోసేసిన అల్లుడు.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే..!

Son-in-law pushed mother-in-law into the well. మహారాష్ట్రలోని అకోలాలో ఓ వ్యక్తి తన అత్తని బావిలోకి తోసిన సంఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  9 Feb 2022 2:45 PM GMT
అత్తని బావిలోకి తోసేసిన అల్లుడు.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే..!

మహారాష్ట్రలోని అకోలాలో ఓ వ్యక్తి తన అత్తని బావిలోకి తోసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అత్త ప్రాణాలు కోల్పోయింది. తన ప్లాన్ ను అమలు చేసిన అనంతరం ఆ అల్లుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అదే సమయంలో ఈ విషయాన్ని గమనించిన చిన్నారి అక్కడి నుండి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది. మహారాష్ట్రలోని అకోలా జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడేగావ్‌లో ఒక వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నాడు. అతని అత్త కూడా అక్కడే ఉంది. ఆ వ్యక్తి ఏదో విషయమై అత్తతో గొడవ పడ్డాడు. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో అల్లుడు అత్తని పొలంలో నిర్మించిన బావిలోకి తోసేశాడు. అత్త నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది.

అదే ప్రాంతంలో ఉన్న ఓ చిన్నారి అక్కడి నుంచి పారిపోయింది. చిన్నారి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులు, స్థానిక ప్రజల సహాయంతో మహిళను బావిలో నుండి బయటకు తీశారు, కానీ అప్పటికే ఆమె మరణించింది. ఈ కేసులో నిందితుడైన అల్లుడు విలాస్ ఇంగ్లేపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 60 ఏళ్ల చంద్రకళ డాకోర్‌, అల్లుడు విలాస్‌ ఇంగ్లే మధ్య ఏదో కారణమై గొడవ జరిగింది. ఆ వివాదం తర్వాత, అల్లుడు అత్తని బావిలోకి నెట్టాడు, దీంతో అత్త మునిగిపోయింది. అక్కడ ఉన్న పిల్లవాడు భయపడి పారిపోయాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు.
Next Story
Share it