హైద్రాబాద్‌లో దారుణం : కన్న తల్లినే కడతేర్చిన సైకో కొడుకు

Son Brutally Killed Mother. కన్న తల్లినే కడతేర్చాడో ఓ సైకో కొడుకు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్

By Medi Samrat  Published on  24 Jan 2022 11:16 AM IST
హైద్రాబాద్‌లో దారుణం : కన్న తల్లినే కడతేర్చిన సైకో కొడుకు

కన్న తల్లినే కడతేర్చాడో ఓ సైకో కొడుకు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి 2.30 గంట‌ల‌ ప్రాంతంలో వ్యాయామం చేస్తుండగా.. తల్లి మందలించడంతో రాడ్‌తో తల్లిని తలపై కొట్టాడు సైకో కొడుకు సుధీర్. అడ్డొచ్చిన‌ చెల్లిని కూడా రాడ్‌తో మోదాడు సైకో సుధీర్. సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే త‌ల్లి పాపమ్మ మృతి చెంద‌గా.. చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయలైన చెల్లిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.. మృతి చెందిన త‌ల్లి పాపమ్మను మార్చురీకి తరలించారు. గతకొన్ని రోజులుగా సుధీర్ సైకోగా (మతిస్థిమితం లేని వ్య‌క్తిగా) ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుధీర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Next Story