డబ్బుల కోసం సుత్తితో కొడుకు దాడి.. తండ్రి మృతి, తల్లి పరిస్థితి విషమం
Son attacked parents in Delhi.. Father died, mother's condition critical. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఓ కొడుకు తన తల్లిదండ్రులపై
By అంజి Published on 8 Oct 2022 10:40 AM ISTదేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఓ కొడుకు తన తల్లిదండ్రులపై సుత్తితో దాడి చేశాడు. వారు నిద్రిస్తున్న టైమ్‌లో ఇంట్లోకి వెళ్లి సుత్తితో శరీరంపై బలంగా బాదాడు. ఈ దారుణ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలోని ఫతేనగర్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడైన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ ఢిల్లీలోని ఫతే నగర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిందితుడు జస్దీప్ సింగ్ (34) తన తల్లిదండ్రులను డబ్బు ఇవ్వాలని అడగగా.. వారు నిరాకరించడంతో ఈ ఘటన జరిగిందని డీసీపీ (పశ్చిమ) ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు. ఆ తర్వాత ఇద్దరిపైనా దాడి చేశాడు. శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరినీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 65 ఏళ్ల స్వరంజిత్ సింగ్ మరణించినట్లు ప్రకటించారు. అదే సమయంలో అతని 60 ఏళ్ల భార్య అజిందర్ కౌర్ తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఆమెకు కొన్ని తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనను సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు జస్దీప్ సింగ్‌కు వివాహమైందని స్టాక్‌మార్కెట్‌లో లక్షల్లో నష్టపోయాడని డీసీపీ తెలిపారు. అతను తన తల్లిదండ్రులతో నివసించాడు. స్టాక్ మార్కెట్‌లో 7 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై వారిపై దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం జస్దీప్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని సుందర్ నగ్రి ప్రాంతంలో 5 రోజుల క్రితం శనివారం రాత్రి ఓ వ్యక్తి రోడ్డుపై కత్తితో పొడిచి చంపబడ్డాడు. మృతుడు సుందర్ నగరికి చెందిన మనీష్ (25)గా గుర్తించారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆలం, బిలాల్, ఫైజాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.