ట్రేడింగ్‌లో నష్టాలు.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Software Engineer ends life after losses in trading. స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌లో నష్టాలు రావడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శుక్రవారం

By Medi Samrat  Published on  12 Aug 2022 2:50 PM IST
ట్రేడింగ్‌లో నష్టాలు.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌లో నష్టాలు రావడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శుక్రవారం అమీన్‌పూర్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ఖమ్మం జిల్లా గోళ్లపాడుకు చెందిన గుడ్ల లక్ష్మీనారాయణ(37) గా గుర్తించారు. లక్ష్మీనారాయణ అమీన్‌పూర్‌లోని పీజేఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మీనారాయణ ఓ ఎంఎన్‌సిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

అమీన్‌పూర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనారాయణ తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్యం కోసం స్వగ్రామంలో ఉన్న ఆస్తిని అమ్మేశాడు. అందులో మిగిలిన 20 లక్షలు స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాడు. అనుకోకుండా వాటిలో న‌ష్టాలు చ‌విచూశాడు. దీంతో ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతూ లక్ష్మీనారాయణ తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే లక్ష్మీనారాయణ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.





Next Story