సాప్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ‌హ‌త్య‌

Software Employee Murder in Hyderabad. హైద్రాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌

By Medi Samrat  Published on  3 July 2022 4:40 PM IST
సాప్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ‌హ‌త్య‌

హైద్రాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ జిన్నారంలో శ‌వ‌పై క‌నిపించాడు. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెంబర్-1 లో ఫ్రెండ్ తో కలిసి నివసిస్తున్న నారాయణ రెడ్డి (25) అనే వ్యక్తి.. గత నెల 30వ తేదీన అదృశ్యమ‌య్యాడు. ఫిర్యాదు మేర‌కు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జిన్నారంలో హత్య చేసి తగులబెట్టిన‌ స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతుడిని నారాయణ రెడ్డిగా గుర్తించారు.

సంవత్సరం క్రితం ఓ యువతిని నారాయణ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు.. యువతిని బలవంతంగా తీసుకుని వెళ్లి హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే.. గత నెల రోజులుగా యువతి, నారాయ‌ణ రెడ్డి ఫోన్‌లో మాట్లాడుకుంటున్న‌ట్లుగా త‌ల్లిదండ్రులు, బంధువులు గుర్తించారు. దీంతో నారాయణ రెడ్డిపై యువతి బంధువులు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే యువతి తల్లిదండ్రులు, బంధువులు హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.










Next Story