మేడ్చల్ ప్రజలను భయపెట్టిన పుర్రె.. చెప్పులు, పసుపు చీర..!

సోమవారం నగర శివారులోని మేడ్చల్ మండలంలోని అత్వెల్లి గ్రామ సమీప ప్రాంతంలో ప్రజలు ఒక నిర్మానుష్య ప్రదేశంలో పుర్రెను కనుగొన్నారు.

By Medi Samrat  Published on  22 July 2024 4:17 PM
Mechal

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

సోమవారం నగర శివారులోని మేడ్చల్ మండలంలోని అత్వెల్లి గ్రామ సమీప ప్రాంతంలో ప్రజలు ఒక నిర్మానుష్య ప్రదేశంలో పుర్రెను కనుగొన్నారు. చెప్పులు, ఎర్రటి అంచు ఉన్న పసుపు చీర, తెల్లటి బ్యాగ్, ఎర్రటి బ్లౌజ్‌తో పాటు నేలపై పుర్రె కనిపించింది.

సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని పుర్రెను పరిశీలించి ఆరు నెలల క్రితం మహిళ హత్య జరిగి ఉండవచ్చని తెలిపారు. బాధితురాలిని సమీపంలో ఎక్కడో పాతిపెట్టి ఉండవచ్చని, వర్షాల కారణంగా పుర్రె పైకి వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేశామని.. మహిళను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

గత ఏడాది కాలంలో ఎవరైనా మహిళ తప్పిపోయిందేమో అని తెలుసుకోడానికి పోలీసులు ట్రై కమిషనరేట్‌లోని పోలీస్ స్టేషన్‌లను సంప్రదించారు. కనీసం ఘటనా స్థలంలో లభించిన బట్టల వివరాలు కూడా క్లూగా పని చేయనున్నాయి.

Next Story