చందానగర్‌లో విషాదం.. ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహ‌త్య‌

చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని 15 అంతస్తు నుండి కిందికి

By Medi Samrat
Published on : 29 Sept 2023 9:45 PM IST

చందానగర్‌లో విషాదం.. ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహ‌త్య‌

చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని 15 అంతస్తు నుండి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. బాలిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. చందానగర్ లోని నల్లగండ్లలో ఉన్న అపర్ణ సరోవర్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని ట్యూషన్ కు వెళ్లి 15వ అంతస్తు నుండి కిందికి దూకింది. దీంతో తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

బాలిక ఒత్తిడి కార‌ణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తుంది. 15వ అంత‌స్తు నుంచి దూక‌డంతో.. ఒక్కసారిగా పెద్ద శబ్దం వ‌చ్చింది. దీంతో స్థానికులు వచ్చి చూడగా.. బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. అది చూసి అక్క‌డున్నవారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story