పబ్‌లో గొడవ.. మాజీ అధికారి కొడుకుపై దాడి.. అసలు ట్విస్ట్‌ ఇదే

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పరిధిలోని ఓ పబ్బులో జరిగిన గొడవ పోలీస్ స్టేషన్‌కి చేరింది. దీంతో ఈ గొడవ విషయం వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on  14 Sept 2023 10:11 AM IST
Jubilee Hills, Hyderabad, Crime news

పబ్‌లో గొడవ.. మాజీ అధికారి కొడుకుపై దాడి.. అసలు ట్విస్ట్‌ ఇదే

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పరిధిలోని ఓ పబ్బులో జరిగిన గొడవ పోలీస్ స్టేషన్‌కి చేరింది. దీంతో గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జీరో 40 పబ్‌లో మాజీ ఉన్నతాధికారి కుమారుడితో ఆరుగురు వ్యక్తులు ఘర్షణకు దిగారు. పబ్బులో ఎంజాయ్ చేస్తూ ఆరుగురు యువకులు పీకలదాకా మద్యం సేవించి.. ఆ మత్తులో ఒక మాజీ ఉన్నతాధికారి కుమారుడితో గొడవకు దిగారు. ఇరువురి మధ్య మాట పెరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైనా ఆరుగురు యువకులు ఒక్కసారిగా మాజీ ఉన్నతాధికారి కుమారుడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన ఆ యువకుడు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.

పార్కింగ్ విషయంలో తనపై ఆరుగురు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసినట్లుగా మాజీ అధికారి కుమారుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన వారిలో ముగ్గురు ఆఫ్రికన్లతో పాటు మరో ముగ్గురు ఉన్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా.. మరోవైపు మాజీ ఉన్నతాధికారి కుమారునిపై దాడి చేయడమే కాకుండా ఆ ఆరుగురు ప్రబుద్ధులు తమపై మాజీ ఉన్నతాధికారి కొడుకు దాడి చేశాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఇరుపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

Next Story