శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

Six people died in Srikalahasti road accident. శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. లారీని కారు ఢీ కొట్ట‌డంతో ఆరుగురు మ‌ర‌ణించారు.

By Medi Samrat
Published on : 9 July 2023 4:22 PM IST

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. లారీని కారు ఢీ కొట్ట‌డంతో ఆరుగురు మ‌ర‌ణించారు. కారులో ఉన్న ఏడుగురు ప్ర‌యాణికులు తిరుమల నుంచి శ్రీకాళహస్తికి వెళుతుండగా మిట్ట‌కండ్రిగ వ‌ద్ద‌ ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక్క‌డే ఆరుగురు మ‌ర‌ణించారు. మ‌రొక‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వ్య‌క్తిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్ర‌మాదం జ‌రగ‌డంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు స‌మాచారం అందుకున్న‌వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిశీలించారు. అతివేగంతో వస్తున్న లారీని కారు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులను ర‌మేష్‌, న‌ర‌సింహ‌మూర్తి, రాజ్య‌ల‌క్ష్మీ, శ్రీల‌త‌, అక్ష‌య‌, వెంక‌ట‌ర‌మ‌ణ‌గా గుర్తించారు. మృతుల స్వ‌స్థ‌లం విజ‌య‌వాడ‌గా గుర్తించారు.


Next Story